ఎమ్మెల్యే జె.సి.ప్రభాకర్ రెడ్డి గారి చేతులమీదుగా ఎనుముల(చూడిపెయ్యల) పంపిణీ…

ఎమ్మెల్యే జె.సి.ప్రభాకర్ రెడ్డి గారి చేతులమీదుగా ఎనుముల(చూడిపెయ్యల) పంపిణీ

తాడిపత్రి మండలం రావివెంకటాంపల్లి గ్రామంలో ఎస్సీ స్వయం సహాయక సంఘ మహిళలకు ఎమ్మెల్యే జె.సి.ప్రభాకర్ రెడ్డి గారి చేతులమీదుగా ఎనుముల(చూడిపెయ్యల) పంపిణీ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ స్యయం సహాయక మహిళలు ఈ పాడిపశువుల పెంపకం వల్ల పాలవ్యాపారం చేసుకునేందుకు వెసులుబాటు అవుతుందన్నారు. తద్వారా జీవోనోపాధికి దోహదపడుందన్నారు.

పశు సంవర్ధకశాఖ మరియు డిఆర్డీఏ వెలుగు వారి సమన్వయంతో 2017-18 ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో ఎస్సీ స్వయం సహాయకసంఘ మహిళలకు 75 % సబ్సిడీక్రింద ఈ ఏనుములను పంపిణీ చేస్తున్నట్లు తాడిపత్రి పశువైద్యాధికారి హేమాంబర నాయుడు తెలిపారు. ఈపథకం ద్వారా ఒక్కొక్క పాడిపశువు విలువ రూ. 60వేలు కాగా ఇందులో లబ్దిదారుని వాటా రూ. 15వేలు, ప్రభుత్వ వాటా రూ.45వేలు అందిస్తోందన్నారు. సబ్సిడీ పథకంపై జిల్లాలోనే ప్రప్రథమంగా తాడిపత్రి మండలంలో ఒక్కొక్కరికి ఒక పాడిపశువు చొప్పున రావివెంకటాంపల్లిలో 10మందికి,చిన్నపోలమడలో ఇరువురికి, పెద్దపోలమడలో ఇరువురికి, కావేటిసముద్రంలోముగ్గురికి, కోమలిలో 5మందికి చొప్పున లబ్ధిదారులకు ఈపాడిపశువులను పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు.

Post Author: Admin

43 thoughts on “ఎమ్మెల్యే జె.సి.ప్రభాకర్ రెడ్డి గారి చేతులమీదుగా ఎనుముల(చూడిపెయ్యల) పంపిణీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *